Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కీర్తిశేషులైన ప్రతాపచంద్ర ముజుందారుగారు బ్రహ్మసమాజము.

349

స్తవమతబోధ వ్యాప్తమగుచుండుటయు, వేద చోదితములగు నార్షమతథర్మములెట్టివో హిందువులకు జక్కగాఁ దెలియకుండుటయు హిందూమతము కేవలము బాహ్యాడంబరములచేతను బలువిధములగు కర్మలచేతను మూఢభక్తియుక్తమగు దురాచారములచేతను బ్రచ్ఛన్నమై కొంకువడిన స్వభావౌన్నత్యము గలిగియుండుటయుఁ దటస్థమగుటచే నాతఁడప్పుడీ బ్రహ్మసమాజమతమును బోధించెను. ఆకాలమున హిందువులలో మూఢభక్తియు బాహ్యడంబరవేషములును బ్రబలెనుగాని హిందూమతము క్షీణదశయందుండెననిగాని యాషన్మమతమడుగంటెననిగాని, హిందూమతధర్మము లనాదరణీయములయ్యెననిగాని యెంతమాత్రము దలఁపరాదు. ఈవిధముగాఁ బ్రపంచమందుగల అన్నిమతములునుగూడ మూఢభక్తిజనితమగు దురాచారములచేతను కేవల బాహ్యడంబరవేషములచేతను ధమతమ యోగ్యత కొకానొకప్పుడు హానిగలిగియుండుటయు నట్టిసమయమున హిందూమతమునకు బ్రహ్మసమాజమతమువలెనే ఆయామతములను బరిశుద్ధిచేయుటకుఁ గొన్నికొన్నిమార్పులు చేయఁబడుచుండుటయు మతచారిత్రముల నెఱిఁగినవారికిఁ దెలియనియంశముగాదు. మతాభిమానులకు బాహ్యాడంబరమత్యావశ్యకమనియు మతాచరణమునకు మూఢభక్తిజనితమగుదురాచారము లనుష్ఠానయోగ్యమగు ధర్మములనియుఁదలఁచుచు హిందూమతము గేవలము కర్మమార్గానుసరణమై దూ