Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

ఉపన్యాసపయోనిధి

ర్మసారములని చెప్పఁబడు మతములన్నియు నీరీతినే యనుస్ఠానయోగ్యములును సామాన్య జనాదరణీయములును గాక నచిరప్రచురములై నశించుట సంభవించుచున్నది. రామకృష్ణపరమహంసవంటి జ్ఞానుల కన్నిమతములును అనుష్ఠానయోగ్యములై యొక్కటియేయైనను సామాన్యజనులకుమాత్రమట్లు కానేరవు. అట్టి మహానుభావులగు జ్ఞానులన్ని మతగ్రంధములను సమానగౌరవబుద్ధితోడఁ జదివి యూదుమతము, క్రైస్తవమతము, మహమ్మదీయమతము, బౌద్ధమతము మొదలగు స్థూలదృష్టికిఁ బరస్పరవిరోధములుగాఁ గనుపించు మతములన్నియు నొక్కేధర్మమును బోధించునని తెలిసికొని ఆయామతధర్మములనుఁ దమలోఁ గనుగొనిఁ యంగీకరింపఁగలుగుదురు. అట్టిజ్ఞానము సామాన్యజనులకుమాత్ర మలవడదు. మహాత్ముల కనుష్ఠానయోగ్యమగు ధర్మములు మూఢులకెంతమాత్రమును బోధపడవు.

బ్రహ్మసమాజమతము క్షీణించుటకుఁ బైనరెండు వాస్తవమైన ముఖ్యకారణములు జెప్పఁబడినవి. కాని మహానుభావులగు జ్ఞానులును వేదాంతులునుమాత్రమే మతమును క్షీణించుననిగాని నశించుననిగాని యెంచరు. రామమోహనరాయులు జీవించియున్న కాలమున హిందువుల కనుష్ఠానయోగ్యములగు గొన్ని హిందూమతధర్మములు కేవలము ననాదరణీయిములై యుండుటయు మహమ్మదీయుల ప్రభుత్వముక్షీణించి యాంగ్లేయుల పరిపాలనమారంభమయి క్రై