కీర్తిశేషులైన ప్రతాపచంద్ర ముజుందారుగారు బ్రహ్మసమాజము.
345
స్తునుగూర్చియు నాతఁడుబోధించిన మతధర్మములను గూర్చియుఁ జెప్పుచున్న బైబిలుగ్రంథమును మహమ్మదీయ మతస్థాపకుఁడగు మహమ్మదుచేబోధింపబడిన తన్మతధర్మములుగల కురానుగ్రంధమును గురునానకుచే స్థాపింపఁబడిన సీక్కుమతగ్రంథమును ఆయామతములవారికిఁ అమృతసార పట్టణమున దేవాలయమున బూజింపఁబడుచున్నది. మహమ్మదీయులును సంస్కారిక క్రైస్తవ మతావలంబకులును తమతమమతోద్ధారకుల గోలీలచుట్టును దీపములను వెలిగించి వారిఖననస్థానములను నతిపవిత్రములుగా బరిగణించుచుదైవప్రార్ధనమునకొక మతసమ్మతమగు గ్రంధము నుపయోగించుచు కేవలము విగ్రహారాధనముఁ జేయకున్నను హిందువులకంటె నతనికృష్ఠభావమైన విగ్రహారాధనమును జేయుచునే యున్నారు. కావున ఆకార రహితుఁడును, నిర్గుణుఁడును, నిర్వికారస్వరూపుడును అగు భగవంతుని సాకారరూపమైన పదార్థచిహ్నములచే బూజింపవలెనను మనోవాంఛయెట్లు నిర్మూలము జేయఁబడఁగలదు? మనోవికారమును మొదలంట రూపుమాపుకొనఁగల్గి నిర్మలజ్ఞానపరులై భక్తిపరవశులగు మహానుభావులు కొందరుమాత్రమే విగ్రహారాధనాదిసాధనము లవసరములేకయే భగవంతునారాధింపఁగలరు కాని జనసామాన్యులకది యలవడనేరదు. జనసామాన్యులకు విగ్రహారాథనాది సాధనములవసరము. అట్టిసాధనములు లేకపోయినచో వారు కేవల జ్ఞానమార్గానుసరణముగ మ