Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

ఉపన్యాసపయోనిధి

"The most beautiful perhaps properly the only true philosophical song that exists in any known tongue (లోకమునంగల సుప్రసిద్ధభాషలో నింత సత్యమయిన వేదాంతగ్రంధము (గీతములు) లేదు. ఇయ్యదిచాలమనోహరమయినది.)

(3) స్లెజల్ (Schlegel) అనుజ్ఞాని భగవద్గీతను లాటిను (Latin) భాషలోనికి భాషాంతరీకరించి తుదనిగీతలబోధించిన శ్రీకృష్ణునిగూర్చి యిట్లువ్రాసియున్నాఁడు;-

"Whose oracular soul is as it were, snatched aloft into divine and eternal truth with a certain and ineffable delight (అతని దివ్యాంతరాత్మ నిక్కమును అనిర్వచనీయమునునగు నానందముతో నవ్యమును సనాతనమును నగుసత్యమును ఘనముగా స్వీకరించినది.)

(4) లాసెను (Lassen) అనుజ్ఞానియు, బైరీతినే నుడివియున్నాఁడు.

(5) గీతల నింగ్లీషులోనికి భాషాంతరీకరించిన సర్ ఎడ్విను ఆర్‌నల్డుదొరవారును ఈరీతిని నుడివియున్నారు :—