పుట:Upanyaasapayoonidhi (1911).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గణాధిపతి Ganesa-gita, which is identical in substanee with the Bhavadgita, the name of Ganesa being submitted for that of Krishna."

   (పరాత్పరుని గణేశునిగా భావించు గాణావత్యులను శాఖయొక్కటి హిందువులందు గలదు. వారి మతసిద్దాంతములు గణపతి పురాణమునందు గలవు. ఇంకను భగవద్గీతతో దుల్యమైన గణేశగీరమును వీరికిగలదు. ఈ గీతయందు కృష్ణునకు మాఱుగా గణేశుని నామ మీబడియున్నది0.
   దీనిని బట్టి గాణావత్యులు కూడ నిక్కమైన వేదాంతము కలవారు గాని వట్టి విగ్రహా రాధకులు గారని స్పష్టమగుచున్నది.
                                         *

మతము.

మతమునుగూర్చి పలువురకు బలువిధములైన తలంపులు కలవు. ఇది యిట్టిదని నిర్వచించుటలోనే యభిప్రాయ భేదములు చాలకలవు. కాంటు (Kant) అను జర్మనీదేశపు జ్ఞానియొక్క యభిప్రాయములనుబట్టి మతమన నీతి యగుచున్నది. ఫిచ్చి(Fichte) అను నాతనితలంపున మనుజుడుతన్ను తాను తెలిసికొనుటకనుకూలించినది.(అనగా ఆత్మజ్ఞానము)