332
ఉపన్యాసపయోనిధి
చే నీపావనదినములకీ పేరులువచ్చినవి. సృష్టిస్థితిలయములను బట్టి యీశ్వరశక్తిమనకు మూడువిధములుగా వ్యక్తమగుచున్నది. సృష్టించుశక్తికి సరస్వతి యనియు రక్షించు శక్తికి లక్ష్మియనియు లయింపఁజేయు శక్తికిఁ గాళియనియుఁ బేరులీయఁబడియున్నవి. కావున నీత్రివిధ శక్తులును నీదినములలో నారాధింపఁబడుదురు. ఆయుధాదిపూజలచే శక్తి (కాళీ) పూజయు, పుస్తకపూజచే సరస్వతీ పూజయు నాభరణాదిపూజచే లక్ష్మీపూజయు నిప్పటికిని జరుగుచున్నదని బుద్ధిమంతులెల్లరు నెఱింగియున్న సంగతియేకదా. వీనిలో శక్తిపూజ ప్రథానముగాఁ బెద్దలచేఁజేకొనఁబడినది. విద్యార్థులు తామునేర్చిన విద్యలఁ బెద్దలకుజూపి వారిమెప్పునందుటకై యీదినము లేర్పాటుచేయఁ బడినవి. ఇప్పుడీదినములలో జరుగుచున్న యాచారమును బట్టిచూడఁ బూర్వకాలమునందు బడులలోఁ జదువను వ్రాయను నేర్పుటయకాక బ్రాహ్మణాది సమస్తవర్ణముల బాలురకునుగూడ విలువిద్యగూడ నేర్పఁబడెడిదని తెలియవచ్చుచున్నది. అందులకే యీ దినములలో దేశీయపాఠశాలలలోఁ జదువుకొను విద్యార్ధులెల్ల విల్లమ్ము బద్దలఁదాల్చి గృహస్థులిండ్లకు వచ్చుట యాచారముగా నున్నది. విల్లు (ధనస్సు) అమ్ము (బాణము) కాఁగా విల్లమ్ము లైనవి. పూర్వకాలమునందు విద్యార్థులు విల్లమ్ముల దాల్చివచ్చిన తమహితులగు గృహస్థులముందు