పుట:Upanyaasapayoonidhi (1911).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెక్కేల, వెఱ్ఱియుక్తులతో నీ యుపన్యాసము నిండి యున్నది. దీనిని జదువు కొని లేని వివేకము కలుగుటకు మారుగా నున్నదికూడ చూడునని నొక్కి వక్కాణీచుచునీనిస్సారమగు నుపన్యాసమును విమర్శించుట నింతటితో గట్టి పెట్టి దీనితో సంబంధము గల "భగవద్గుణము" లను మన వ్యాసమును ముందు విమర్శింతము.

                                      *

దసరా.

  ఈ సమయము దసరాపండుగచే ప్రజలకానందమును గూర్చినదగుటచే నీయుత్సవముంగూర్చి యొక్కింతముచ్చటించుకొనుట యనగత్యము కాదు. దసరా యనుపదము దశాహ(ర్) పదిమునుండి పుట్టినదని కొందఱు తలంచు చున్నారు.  కొందఱు దశరాత్రభవమని యోచించుచున్నారు.దశాహశ్శబ్దభవమైన చో పదిదినములని గాని పదియవదినమని గాని యర్దమగును.  దశరాత్ర పద భవమనుచో పదిరాత్రులని యొండె పదియరాత్రియని యొండె భావమగును.  పదిపదులైననేమి పదిరేలయిననేమి పదిదినములపండుకయని రెండర్ధములవల నను గూడదేలుచున్నది.  ఈయాశ్వయుజ మాసారంభమున పదిదినముల వఱకు నహోరాత్రములు భగవచ్చక్తినారాధించుటకు మనపెద్దలేర్పాటు చేసియుండుట.