Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

ఉపన్యాసపయోనిధి

గాఁబోలు. ఆరక్షక భటులు జనులుతెలియకకూడనితావుల మూత్ర విసర్జనాదులఁ జేసిన వారట్లు చేయబోవుచుండఁ జూచియు ముందువారింపక యూరకుండి వారట్లాచరించిన తర్వాతఁబట్టుకొందురు. భగవంతుఁడును వీరిజాతిలోనివాఁడని తోచుచున్నది. చూచిచూచి ముందేల నివారింపఁడు? ఈప్రశ్నకుఁ బంతులవారు సమాధానతల్లజము నొకదానిఁజెప్పిరి. ఏదియన;- "ఈప్రశ్నకు వేఱుమాటలతో మనుష్యునకు పాపకార్యములనుజేయ స్వాతంత్ర్యమేలయిచ్చినాఁడని యర్ధమగును. అనఁగా పశువులవలె మనలనేలచేయలేదని తాత్పర్య మేర్పడును" అనిచక్కఁగానుడివిరి. కానితామన్న మాటలకు వేఱుమాటలతో నేమియర్ధమగునో యాలోచించుకొనరైరి. మనలభగవంతుఁడు పాపకార్యము లొనరింపకుండనేలవారింపఁ డనుదానికి వేఱుమాటలతో మనల భగవంతుఁడేల పశుతుల్యులఁ జేయలేదని యడుగుట యర్థమగునేని దీనికి వేఱుమాటలతో మనముపాపకార్యములఁ జేయమేనిఁ బశుతుల్యుల మగుదుమనియర్థమగును. ఇదిన్యాయమా? “ఓసర్వకారుణ్యా! ఓభక్తవత్సలా! భక్తులమయిన మాప్రార్థనలాలించి మాహృదయము లెప్పుడును నీధ్యానమునందే తగిలి యుండునట్లును సత్కార్యాచరణమునందే యాసక్తములై యుండునట్లును జేయుము” అని 'హిందూమతములు' అను నుపన్యాసాంతమున భగవంతుని వీరు ప్రాధించిరికదా దీనిభావమేమి? దీనికివేఱుమాటలతో "ఓసర్వకారుణ్యా! ఓభ