Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపశిక్షణమనునుపన్యాసవిమర్శనము.

321

బట్టి యారాత్రులందుఁగల వెలుగునందుగల హెచ్చుతగ్గులనుబట్టి చీఁకటిని నట్లంటిమేకానివేఱుకాదు. అట్లనే పాపవిషయమునను ననవచ్చునందురేని వాక్పా రుష్యమునందు భగవంతునిఁదృప్తునిజేయఁ జాలినంతకంటెఁ దక్కువగాఁ బుణ్యమున్నదనియు గురుహింస యందంతకన్నను తక్కువగా పుణ్యము కలిగినదనియుఁ నందుమూలమున రెంటికిని భేదభావము గలిగినదనియుఁజెప్పవలెను. అనఁగాగురుహింసాదులు స్వల్పాతిస్వల్పమగు పుణ్యకార్యములేయనవలయును. ఇంతవింతకలదా?

మఱియు బుణ్యపాపములు రెండును లేనియవస్థలు గూడ గలవు. ఒకబాలుఁడు పుట్టఁగనే మృతిఁబొందును. వీనిఁబాపి యనవలెనా? పుణ్యాత్ముఁడనవలెనా? పునర్జన్మములేదు గదా వీనికి శాశ్వతపుణ్యలోకమువచ్చునా? శాశ్వతనరకలోకమువచ్చునా? పుణ్యలోకమేవచ్చునెడ నట్టిచావే యుత్తమము. "మన కెప్పుడును కొన్ని లోపములుండక తప్పదు" అనిపంతులవారువ్రాయుచున్నారు. కాఁబట్టిమనము లోకమునజీవించినకొలఁదిఁ బాపులమగుచుందుము - కానఁ బుట్టఁగనే చచ్చుటమంచిది. కాఁబట్టిమనకు శాశ్వతస్వర్గము లేకపోయినను నిఁకనయినఁ బుట్టఁగనే శిశువుల జంపుచుందుమేని వానికయిన నదిసులభముగ లభ్యమగునుగదా! ఇదితగునా? నరకమే వచ్చుననిన నేనేరములు జేయుట యెట్టిదో యెఱుంగని శిశువును ఘోరనరకమందుఁ బడవైచుట న్యాయమెట్లగును. ఇది ఘోరముకాదా?