Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

ఉపన్యాసపయోనిధి

ల బుద్ధిమంతులందరు వీనిని ద్వంద్వములు (opposites) అనుచున్నారు. కాని మొదటివానియొక్క యభావములు రెండవవియనుట లేదే. ఏలన నీరెండునుగాని స్థితులుగూడ నున్నవి. అట్టిస్థితులులేవు పుణ్యముయొక్క యభావము పాపము తప్పక యగునందురా ? మంచిది.

భావపదార్థమునకే గుణమును దానిఁబట్టి పరిమాణమును నుండునుగాని యభావపదార్ధమున కుండనేరవుకదా ? ఇఁకపాపములో హెచ్చుతగ్గులను దెల్పుటయెట్లు? సామాన్యమగు వాక్పారుష్యమువలన వచ్చిన పాపమును బుణ్యాభావమే. గురుహింసవలన వచ్చిన పాపమును బుణ్యాభావమే. రెండును నభావపదార్ధములే యగుటచేత వానికి గుణముండదు కావున దానివలని ఫలముండజనదు. ఉన్నను రెంటికి భేదముండదు ఏమనఁ బావమభావమగుటచే హెచ్చు తగ్గులు లేకపోవుటచేత, అమావస్యనాడు మబ్బుపట్టిన చీకటి హెచ్చుగాను నాకాశము నిర్మలముగ నున్నప్పుడు తక్కువగానునుండుటలేదా యట్లే పాపమును హెచ్చుతగ్గులు గలిగియుండునందురా? అట్లనఁజనదు. ఏలనఁ జీకటియందా తారతమ్యమును వెలుగునుబట్టివచ్చినది. నిర్మలాకాశముగల యమావాస్యనాటి రాత్రియందు మనకంటికిఁ దగినసాహాయ్యమీయ లేని వెలుఁగు మాత్రముండుటచేఁ దానిఁజీకటియనినాము. మబ్బుపట్టిననాటిరాత్రి దానికన్నను వెలుగుతగ్గియుండుటచే దానినిహెచ్చుగు చీఁకటియనినారము - కా