పాపశిక్షణమనునుపన్యాసవిమర్శనము.
319
చ్చునవికావని తేలుచున్నదికదా - ఇట్టిచో భగవంతుఁడు పరలోకమునఁ బాపుల శిక్షించుననఁజనునా ? దీనిలోపము చదువరుల హృదయముల నాటుటకై యొక లోకో దాహరణమునిచ్చెదను;- మనదొరతనమువారు మనలరక్షించుతలంపుతోఁ గొన్నిపరీక్షల నేర్పరచినారు - అందు గృతార్ధులైన వారి నుద్యోగాదు లిచ్చి రక్షింప నెంచియున్నారు. కానివానియందుఁ దేరని వారిని శిక్షించుటకుఁగాదు. కావున నట్లు కృతార్ధులైనవారి సాధ్యమగునంతవఱకు రక్షించుచున్నారుకాని తేరనివారి శిక్షించుటలేదు - కాని మనమేమన తెలివితక్కువచేఁ బరీక్షలందేరక యుద్యోగాదులనంది సుఖించుటలోనగు వానిఁ బొందలేకయుఁ బైఁగాసొమ్ము వమ్ముచేసికొనియుఁ గష్టములకుఁ బాలగుచున్నాము - అట్లగుటకు మనమే కారణముకాని దొరతనమువారు కారుగదా. అట్లనే పాపవిషయమునను జెప్పవలెను - కానఁ బుణ్యరక్షణమను నుపన్యాసమును వ్రాయవలయునుగాని పాపశిక్షణమని వ్రాయదగదు- ఏలయనఁ బుణ్యాత్ములను మాత్రమతఁడు చేకొనునుగాని పుణ్యాభాపులవేఱుగ శిక్షింపఁడు - శిక్షించునేని, ఆబాధమనము తెచ్చుకొనినదికాక భగవంతుని మూలమున నైనదగును - అట్లుకాదని పైనవ్రాయఁబడియే యుండెను.
అతఁడు రక్షింపకపోవుటయే శిక్షయందురా? అట్లయిన రక్షణాభావము శిక్షణమనియు, నాపై సుఖాభావము దుఃఖమనియు నుడువవలెను. ఇట్లనవచ్చునా ! నేటివఱకును గ