Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

ఉపన్యాసపయోనిధి

లోకములో పాపమును, మనుష్యాదులయందు లోపములను బాథలను నెందుకుఁ జేసెనని యాక్షేపణము చేయవచ్చును. పాపమనెడిది యొకటి ప్రత్యేకముగా లేదు. వెలుతురు యొక్క యభావమే ప్రకారముగాఁ జీఁకటి యనఁబడునో యదేప్రకారముగా పుణ్యము యొక్క యభావమే పాప మగును-” అని పాపమనునది లేదనియుఁబుణ్యాభావమనియు నుడివిరి. కావున భగవంతుఁడు దీనిసృజింపలేదు - సృజించిన సర్వకారుణ్యుఁడేకాకపోవును - ఈయుక్తినిఁజెప్పి పంతులవారు భగవంతునిదయాళుత్వమునకు భంగము గలుగకుండఁజేసిరి ఇఁక పుణ్యము నెందుకుసృజించినాఁడనిన, దానినొనర్చుజనుల రక్షించుట కని తక్షణమే వీరు బదులు చెప్పుదురు. దీని భావమును జదువరులు చక్కగా గ్రహింప వలెను. పాప మొనర్చిన వారిని శిక్షించుటకుఁ బాపమును బుణ్యమొనర్చిన వారి రక్షించుటకుఁ బుణ్యమును నొనర్చెనని చెప్పక పైఁగా నట్లు చెప్పిన దయాళుత్వమునకు లోపమువచ్చునని యెంచి పాపమనుదానిని సృజింపనేలేదనియు రక్షించుటకుఁ బుణ్యమును మాత్రము సృజించెననియుఁ జెప్పుచున్నారు - అనఁగా భగవంతుఁడు రక్షణోపాయము నాలోచించుచు రక్షించుచుండుటయే స్వభావముగాఁ గలవాఁడుకాని శిక్షనువిధించువాఁడుకాఁడని తెల్పుచున్నారు - కనుకనే “మనమే భగవదాజ్ఞనుమీఱి పాపులమయికొన్ని బాధలకు లోనగుచుందుము” అని పైదానిక్రిందనేవ్రాసినారు - దీనిచే బాధలు మనము తెచ్చుకొనినవికాని భగవంతుని వలన వ