పుట:Upanyaasapayoonidhi (1911).pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాపశిక్షణమనునుపన్యాసవిమశన్‌నము.

మతమునుగూర్చి రా. బ. కం. వీరేశలింగముపంతులుగారు వ్రాసిన యుపన్యాస మును విమర్శించి తుదిని "పావశిక్షణము" అను నుపన్యాసమును ముందు విమర్శించెద నని వ్రాసియుంటిని గాన నిప్పుడట్లొనర్తును.
   ఈయపన్యాసమును బంతులవారు పాపులకు బరలోకమున భగవంతుడు గలుగజేయు శిక్షలనుగూర్చి కొంత ముచ్చటించిరి.
   వీరియుక్తులను బట్టిచూచిన బరలోకమే లేకపోయినదని ఇదివఱకే కనుకొనియుంటిమికదా.  కాన బరలోకమునశిక్షగలుగుటయను మొదటి విషయ మేపొసగనేరదు.  అయిననుదారముకొఱకు పరలోకమునంగీకరించి తరువాతి విష్యముల విమర్శింతము.
    ఈ యుపన్యాసమునందు పాపశిక్షణముగూర్చి ముచ్చటించిరికాని ముందు పాపమననేమో తెలుపరైరి.  పాపమునకు గలుగుశిక్షనుగూర్చి తెలిసికొనుటకు బూర్వము పాపమననేమో ముందు దెలిసియుండవలెనుగదా- కావున వీరి మతమున బావమననేమో ముందు దెలిసికొందము-  వీరు 'పాప ' మననేమో యిందు జెప్పకపోయినను 'జన్మాంతర ' మను నుపన్యాసమున దీనింగూర్చి యిట్లు వివరించియున్నారు- "భగవంతుడు సర్వసముడుగదా పూర్వజన్మమే లెనియెడల నీ