316
ఉపన్యాసపయోనిధి
వినుము పరమేష్ఠియొద్ద సావిత్రినేను,
అమరమాతను నేను గశ్యపునియొద్ద।
నిన్నిరూపంబులను దాల్చి యింపుమెరయ,
వెలయుదేనొక్కతెను జగద్విశ్రుతముగ.”
దీనినిబట్టి మహాశక్తియే రాధ యని విశద మగుచున్నది. ఈరాధ విష్ణువిషయమున సాక్షాల్లక్ష్మియే కాని వేరు కాదు. కావుననే లక్ష్మీసహస్రనామములలో రాధయను నామము గూడ కలదు. కావున రాధాకృష్ణులు లక్ష్మీ
నారాయణులే కాని వేఱుకాదు. ఈయంశము బ్రహ్మకైవర్తపురాణమువలననే విస్పష్టమగుచున్నది. ఇఁకఁగృష్ణుఁడు రాధికాలోలుఁ డగుటలోఁ దప్పేమికలదు ?
రాధాశబ్దార్ధము బ్రహ్మకైవర్తపురాణమునందె రాధచేతనే యీక్రిందిరీతి నొసంగఁబడియున్నది:--
"రా” శబ్దంబు మహా విష్ణు రోమకూపంబులం గల విశ్వంబులందు వర్తించు “థా" శబ్దంబుమాతృవాచ కంబేని విశ్వంబుల కెల్ల దల్లిని మూలప్రకృతి నగుటంజేసి హరిచేత బుధులచేత రాథయని సమాఖ్యనైతి.”
ఎవ్విథంబునఁ జూచినను రాధ లోకమాత యగు మహాశక్తిగాని వేఱుకాదు. ఈమె లోకపిత యగు కృష్ణుని భార్య. ఇఁక నీవిషయమున వ్యభిచారదోష మెట్లుండఁగలదు ?