శ్రీకృష్ణుఁడుజారుఁడా?
313
ష్టికి విద్యయవసరముగాన బ్రహ్మకు పత్నిగాఁ జెప్పఁబడినది పాలనమునకు లక్ష్మీ ముఖ్యము. కావున విష్ణువునకు లక్ష్మి జాయగా బోధింపఁబడినది. లయమునకు శక్తి ప్రధానము కాఁబట్టి పార్వతి శివుని దారగా వ్యక్తీకరింపఁబడినది. ఈశ్వరశక్తియేమాయ ఆమాయయే యీశ్వరసహధర్మిణి ఆ యీశ్వరమాయయే రాధ. కావున నీమె బ్రహ్మవిషయమున సరస్వతి విష్ణువిషయమున లక్ష్మి శివునివిషయమునఁ బార్వతి ఇట్లు బ్రహ్మ కైవర్తపురాణమే తెలుపుచున్నది.
బ్రహ్మకైవర్తపురాణము - రాథ.
బ్రహ్మకైవర్త పురాణమున రాధ లక్ష్మి యైనట్లుగా నీక్రిందిరీతిని దెలుపఁబడియున్నది:--
"చ. అనవరతంబు నెవ్వనిపదాంబురుహంబులు యోగివర్యులయ్యనిమిషులున మునీశ్వరులు ధ్యానము చేసియు నేర్పు పెంపునం, గనుఁగొనఁజాల రవ్వనజనాభునిపక్షమునందు బ్రీతితో, ననుదినమున్ వసించు జగదంబకు నీకు నమస్కరించెదన్”
అని బ్రహ్మ రాథను స్తుతించియున్నాఁడు. ఇండు రాథ సాక్షాలక్ష్మిగా వర్ణింపఁబడియున్నది.
మఱియును నాగ్రంధమునందే శ్రీకృష్ణ భగవానులవారు రాథం గూర్చి యిట్లు ముచ్చటించి యున్నారు:-
"నేను సర్వంబున కాత్మనగుటంజేసి యేనులేకున్న నన్నియుశవమాత్రంబులైయుండు నాత్మసంపర్కంబునఁ బ్రాణంబులు శక్తిసంపన్నంబులై యుందునయ్యాత్మ ప్రాణంబులంబరి