Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

ఉపన్యాసపయోనిధి

నినన్నిటిని విడచి పరమాత్మయందు మాత్రమే చిత్తముంచినవారికి మాత్రమే మోక్షములభించును. అనిరాసక్రీడ తెలుపుచున్నది.

శ్రీకృష్ణుఁడు జారుఁడు కాఁడని భారత భాగవతములనుబట్టి కనుంగొనియున్నాము. జలక్రీడ రాసక్రీడ మున్నగునవి వినిర్మలవేదాంతములు బోధించు పావనగాధలని తెలిసికొనియున్నాము. కాన నిఁక రాధా మాధవులం గూర్చి చర్చించుకొందము.

రాథాకృష్ణులంగూర్చి ప్రజలకుఁ జాలతప్పు టూహలుకలవు. అవియన్నియును గ్రంథములను దిన్నఁగఁజదువు కొనకపోవుటచే వచ్చిన విపత్తులు. రాధంగూర్చిన గాధలు భారత హరివంశ విష్ణుపురాణములం దెచ్చటను లేవు. ఈవిషయమై విపులముగా ముచ్చటించుచున్నది. బ్రహ్మకైవర్తపురాణము ఈపురాణమునందు రాధాకృష్ణులం గూర్చి చాలతప్పుటూహలున్నట్లు పెక్కురు తలంచుచున్నారు. బాగుగాఁబరికించిచూచిన నీపురాణమును రాథాకృష్ణులం గూర్చి మంచి యూహలనే బోధించు చున్నదని చెప్ప వచ్చును ఏమన :-

రాధయెవరు ?

బ్రహ్మకైవర్తపురాణమును రాధనుగూర్చి మంచిరహస్యములనేబోధించుదున్నది. ఈశ్వరునిశక్తియే యీశ్వర భార్యగా మన గ్రంధములందు వర్ణింపఁబడియున్నది. సృ