Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణుఁడుజారుఁడా?

311

సక్రీడకు ముందుఁ జెప్పఁబడియున్నది. ఈమురళీనాదముయొక్క వేదాంత భావముం గూర్చి సీతారామాంజనేయ సంవాధములో నిట్లుచెప్పఁబడియున్నది -


"సీ. సలలితేంద్రియగోపికలు వరప్రీతిచేఁ
         జనుదెంచి తనుబొంది సంతసింప
    బ్రహ్మదండిలతావి భాస్వదాధారాది
         కపికావళి మహావికాస మొందఁ
    బ్రస్ఫుటీకృతపటు స్ఫుటగుండలీంద్రుఁడ
         త్యానందకరముగా నాడుచుండఁ
    బొందుగాభ్రూమధ్య బృందావనమ్మునఁ
                      గోపాలమూర్తిన్

గీ. విమలమానస పవనహస్తములచేతఁ
   దనసుషుమ్నా మురళిలీలఁదాల్చిమధుర
   గానమొనరించెననఁగ నోంకారమలఘు
   వేణునాదస్వరూపమై వెలయునంత ॥"


కృష్ణుఁడను పరమాత్మ యోంకారనాధమను మురళీగానమును జేయఁగా గోపికలను మునులు తన్మయత్వము నంది యాపరమాత్మం గూడి యానందించిరని రాసక్రీడవలన మనము తెలిసికొనవలెను. కృష్ణుఁడను పరమాత్మను బొందుటకు దారేషణ పుత్రేషణ ధనేషణాదు లేవియును పనికిరాక పోవుటయే కాక దానికభ్యంతరములుకూడనై యుండును. వా