శ్రీకృష్ణుఁడుజారుఁడా?
303
భ్యాసమునుబట్టితెలుఁగుకవి యిటతలవనితలంపుగాఁగుచవర్ణనమును బెట్టియున్నాఁడు. సంస్కృతకవి యాసందు కూడఁ గలిగించి యుండలేదు.
పైకారణములచే గోపికావస్త్రాపహరణఘట్టము కృష్ణుఁడుజారుఁడని తెలుపుట కింతయు నవకాశము కలదిగా నుండ లేదని సర్వవిధముల నిస్సంశయముగాఁ జెప్ప వచ్చును.
ఇఁక ఈకధ మూలమున భక్తులు కామపరవశులై పాడైపోయిరాయను నంశముంగూర్చి ముచ్చటించుకొందము.
పైన మనము కృష్ణలీలలు కేవలబాలక్రీడలని కనుగొని యున్నాము. కాఁబట్టి యివి చదువరుల హృదయములందు గామవికారమును నంకురింపఁజేయఁజాలవు. భక్తులెల్లరు నీకధ భక్తిరసప్రధానమయినదిగా గ్రహించుకొనుచున్నారుగాని కామతంత్రముగాఁ దలంచుటలేదు. భక్తులు కాని వారికి దూష్యముగాఁదోఁచిన తోఁచుగాక. భక్తులకట్లుతోఁచుటలేదు. భక్తియున్నప్పుడీనీచోహలు తోఁచవు. అదిమిక్కిలి పావనమైంది. అదిచెడిన నాపిమ్మట నేదితోఁచినను దోఁచవచ్చును. ఇందులకుఁ దార్కాణముగా శ్రీరావుబహదరు కందుకూరి వీరేశలింగము పంతులవారి చారిత్రమునేయుదాహరణముగాఁ దీసికొందము. శ్రీపంతులవారు వృద్ధులయిన తరువాత నేమతము కరిగియుండినను యౌవనమధ్యముననున్న కాలములో నీగోపికా జారుఁడే యిష్ట దైవతముగాఁ గలిగియుండిరి. వీరు 25 ఏండ్లపడుచుతనముననున్న కాలములో