శ్రీకృష్ణుఁడుజారుఁడా?
301
హితలగు కన్యకలుగావుననే భాగవతములో నీ ఘట్టమందు నీగోపికలు 'కమారికాః' అనియు 'కుమార్యః' అనియుఁ జెప్పఁబడియుండిరి. కాఁబట్టి పరస్త్రీలుకారు వివాహముకాని చిట్టిబొట్టెలు.
ఏడేండ్లకు లోఁబడిన వయసుగల చిన్ని కృష్ణుఁడు తనకంటె చిన్నవాండ్రగు గోపబాలికలతోఁ గ్రీడించిన క్రీడలు మన నవనాగరికులకు కామవికార చేష్టలుగాఁ గాన్పించు చున్నవంట! ఇది గొప్పవింతకాదా!! ఏడేండ్లబాలురు నైదేండ్లబాలికలు కలసి వినోదార్తము మాడుకొను నాటలను బట్టి వారియందు జారత్వము నారోపించు మహానుభావుల బుద్ధియే బుద్ధిగదా! ! !
కాఁబట్టి వ్యవహారరీతిచేఁ జూచినను గోపికావస్త్రాపహరణఘట్ట మునుబట్టి శ్రీకృష్ణునందు జారత్వదోషము నెంచుట కవకాశ మిసుమంతయును లేదు.
సంస్కృతభాగవతములో నీఘట్టమునందు వ్యాసభట్టారకులు గోపికల “నందప్రజ కుమారికాః” అనిబాలికల గాఁజెప్పుటయకాక వారి విషయములో నెచ్పటను (గోపికావస్త్రాపహరణ ఘట్టములో కచకుచాది వర్ణనమును గూడఁ జేయలేదు, ఇదంతయు నాగోపికలు పసి బాలికలని తెలుపుటకే యిట్లు వ్యాసులవారిచే వ్రాయఁబడి యున్నదని విస్పష్టము చేయుచున్నది. అయినను ఈరహస్యమును గ్రహింపఁజాల