శ్రీకృష్ణుఁడుజారుఁడా?
299
వయసుకలవానికింద్రియ కామముండుననిబుద్ధిగల వారెవరైనఁ దలంచుటకు నవకాశము కలదా? ఏడేండ్లబాలుఁడు గోపికలతో విహరించెనన నది కామవశమున జరిగిన దనుటకు గాని దానినిబట్టి తాము కామవికారము నందుటకుఁ గాని వివేకముగల పాఠకుల కింతయైనసందుగలదా? కావున భాగవతమున వర్ణింపఁబడిన కృష్ణలీలలన్నియును నతి బాల్యముననే వర్ణింపఁబడి యున్నవగుటచే మనభాగవతాదు లపార్ధము చేసికొనుటకుఁ జదువరుల కింతయు జోటిచ్చుట లేదని సరసులు గ్రహించు కొనవలసి యున్నదిగదా. ఏడేండ్లబాలుఁడు స్త్రీలతో జారత్వము చేసినాఁడఁట. దానిని మననవనాగరికు లధిక్షేపించు చున్నారఁట? ఇందులో నేది వింత? తప్పెవరిది? దోషులెవరు? ఏడేండ్లబాలుఁడుజారత్వము చేసినాఁడని తలంచువారేకదా తప్పక నగుబాటకు లోనుగావలసియుండును?
కాఁబట్టిమన గ్రంధములు కృష్ణుని లీలల నధిక్షేపించుట కవకాశము రవ్వంతయేని నొసంగుటలేదని బుద్ధిమంతు లూహించుకొనఁదగి యున్నది.
అతిబాల్యమున వర్ణింపఁబడిన లీలల నన్యథాభావించుట తప్పని బిసెంటు దొరసానిగారు హీరేంద్రనాథ పాలుగారు మున్నగువారు చక్కఁగా నిదివఱకే వ్రాసియున్నారు.