శ్రీకృష్ణుఁడుజారుఁడా?
295
రు. సదా వారికడకు వచ్చి భగవంతుఁడు వారియోగక్షేమము కనుఁగొనెడివాడు. భగవంతుఁడు తమసమీపమున నున్నను తాము దిగం బరులుగా నుండుటకు వా రెన్నఁడును సిగ్గు పడ లేదు. కాని యా తోటలో లోక జ్ఞానదాయకమగు ఫలములనిచ్చు చెట్టుకలదు. ఆచెట్టు పండ్లను దినవలదని దైవమాజ్ఞ యిచ్చియున్నాఁడు. ఆపండు తిననంతకాలము వారు దేవునెదుట దిగంబరులై యుండుటకు సిగ్గుపడలేదు. ఇంతలో సైతాను ప్రేరణముచే వారు జ్ఞానఫలములను దినిరి. అంతకుఁ బూర్వము అమాయకులుగా నున్న ఆదిమదంపతులు జ్ఞానఫలానుభవము కలిగినది మొదలు భగవంతు నెదుట దిగంబరులుగా నుండుటకుసిగ్గు వడఁజొచ్చిరి. ఆహేతువుచే భగవంతుఁడు యధా పూర్వముగా వారికిదర్శనమిచ్చుటకు రాఁగా నాతని యెదుట బట్టలు లేకుండ నిలుచుటకు సిగ్గువడి యెదుటకు వచ్చుట మానుకొనిరి. అది గని భగ వంతుఁడు వారిని ముందుకు రాఁ బిలచెను. మేము దిగంబరులముగా నున్నాము గాన మీయెదుటకు వచ్చుటకు సిగ్గు వడుచున్నామని వారు సమాధానము చెప్పిరి. “ఇదివఱ కీసిగ్గులేదే. ఇప్పుడుక్రొత్తయేమున్నది. ఇప్పుడు సిగ్గుపడనేల జ్ఞానఫలమును తినినారా” యని భగవంతుఁ డడిగెను. తినినా మనివారు చెప్పఁగా భగవంతుడాగ్రహమును బొంది మీరు జననమరణముల పాలగుదురు గాక యని శపించె. తనయెదుట దిగంబరులుగా వారు సం