శ్రీకృష్ణుఁడుజారుఁడా?
293
నేనుంటే మీరుండుట. నేను లేకుంటే మీరు లేకపోవుట. నేను అనఁగా ప్రజ్ఞ, తెలివియని యర్ధము. “ప్రజ్ఞానం బ్రహ్మేతివ్యజానా" త్తను శ్రుతిప్రకారము ప్రజ్ఞాన మనెడి నేనుంటేనే మీరుండుట. ఆప్రజ్ఞాన మనెడు నేను లేనియెడల మీరును లేకపోదురు గనుక నేను చూడని మర్మ మెద్దికలదు = నేనుసర్వదా మీలోనుండుట మీరెఱుఁగరా - నేను పురుషుఁడు మీరు స్త్రీలు అనెడుభేదము గల్పించుకొని మీరేమో సిగ్గుపడెదరు. (సర్వాణ్యేతాని ప్రజ్ఞానస్య నామధేయాని) అని చెప్పియున్నట్లు యీచతుర్ద శేంద్రియ వ్యాపారములకు కారణభూతుఁడను నేనై యుండగాఁ నా యొద్దనా మీసిగ్గులు. నేను సర్వజ్ఞుఁడనను సంగతి మీకుఁ దెలియదా?
ఈవాక్యము లన్నియునునీగోపికా వస్త్రాపహరణ ఘట్టము వేదాంత బోధకయి యేర్పడిన దని విస్పష్టము చేయు చున్నవి.
ఇంకను నీసందర్భములోఁ గృష్ణు డధిరోహించిన నీవమునుగూర్చి కొంత ముచ్చటించు కొనవలసి యున్నది. ణీఞ్‌ప్రావణే అను ధాతువునుండి పుట్టిన నీవమునకు మానవదేహమర్థము. మానవదేహమును జెట్టుగా నుపనిషత్తులుపలుతావుల వర్ణించుచున్నవి. కాన దేహమందున్న యీశ్వరుని కడ సిగ్గువడు నెడల సదా సిగ్గునందే యుండవలెను. ఆతఁడు గోపికలయందుండియే యున్నాఁడు. ఇఁక ఆతని పట్ల నగ్నులైయుండుటకు సిగ్గేల ?