శ్రీకృష్ణుఁడుజారుఁడా?
287
ర్ణింపఁబడి యుండఁగా నాతఁడు పరస్త్రీవర్జితుఁడని నీవెట్లు చెప్పగలవందురేని నిష్పక్షపాత బుద్ధితోఁ బాగుగా విమర్శించి చూచిన భాగవతమునందు గోపికలను గూర్చియును గృషునిగూర్చియును వర్ణింపఁబడిన కథ లన్నియును భక్తులగు వారికి వేదాంతమును (జీవేశ్వర సంబంధమును) కథల మూలముగాఁ దెలుపుటకు వ్రాయఁబడినవే కాని వేఱుగాదని నిశ్శంకముగాఁ దెలియ గలదు. ఈవిషయము వివేకమూర్తులగు వివేకానందస్వాముల వారిట్లు వ్రాసియున్నారు.
"People with ideas of sex, and of money, and of fame, dubbing up every minute in the heart daring to criticise and understand the love of the Gopies! That is the very essence of the Krishna incarnation. Even the Gita, the great philosophy itself does not compare with that madness for in the Gita the disciple is taught slowly how to walk towards the goal but here is the madness of enjoyment the drunkeness of love where disciples and teachings and teachers and books and all these things have become one even the ideas of fear and God and heaven.”
(కాంతాకనకవివక్ష కలిగినసదా ఎద వానిజపించుకొను వారలా గోపికల ప్రేమానుబంధమును విమర్శించువారు! అయ్యది కృష్ణావతారముయొక్క ప్రధానాంశము. గొప్పవేదాంతశాస్త్రమగు భగవద్గీత కూడ నీగాఢప్రేమతోఁబోల్చి చూచుటకుఁ దగదు. ఏమన గీతలలో శిష్యునకు ముక్తిమా