Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణుఁడుజారుఁడా?

285

"Srikrishna had many bitter enemies during his life on earth, who assailed Him with unmeasured violence, and brought many charges against Him, but none accused Him of immoral relations with women. Shishupala is a striking instance of this. In his vehement tirade against Shrikrishna in which he ranges over His life "defaming and polluting, he does not accuse Him of any crime of this kind. It is obvious that if His contemporaries condemned His relations with the Gopis, His enemies would have made this a chief and most effective charge against him.”

(ఈభూమిపై శ్రీకృష్ణునకుఁ దనజీవితకాలములోనే పలువురు గర్భశత్రువులుగలరు. వాండ్రులెక్కలేనిదౌర్జన్యముతో నాతని నెదుర్కొని యాతనిపై ననేకదోషముల మోపిరి. కాని వాండ్రెవ్వరును గృష్ణునకు స్త్రీలతో నీతిబాహ్యమగు సంపర్కమున్నట్లు నిందమోపియుండలేదు. ఇందులకు శిశుపాలుఁడు ప్రబలనిదర్శనము. మర్యాదనష్టమును గలిగించుచు కలంకమును బొసఁగించుచు శ్రీకృష్ణునిపై నీతఁడుచాల దౌర్జన్యమును జూపియున్నాఁడు. అనిందలలో కృష్ణునందు జారత్వనింద మోపఁబడియుండలేదు. ఆకాలపు వారిలో శ్రీకృష్ణుఁడు స్త్రీలతోఁ గూడనిసాంగత్యము కలిగియున్నాఁడనునింద యాతనియందున్నయెడల నాతని శత్రువులు దానిని బెద్దజేసి యొక గొప్ప దోషముగా నాతని నిదించియుందురనుట విస్పష్టము)