Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

ఉపన్యాసపయోనిధి

మాసములో వచ్చుటలేదు. పుష్యమాసములో వచ్చుచున్నది. ఈభేదమునుబట్టి జ్యౌతిషసిద్దాంతరీతిగా లెక్క వేసిచూచిన భీష్మనిర్యాణకాలము క్రీ॥ పూ॥ 16 వ శతాబ్దమున నైనదని బాలగంగాధరతిలకులు ధీరేంద్రనాధపాలుగారు మున్నగు విద్వాంసులు చెప్పుచున్నారు.

ఇట్టిశాస్త్రీయ కారణములనుబట్టి చూడఁగా శ్రీకృష్ణభగవానులవారు క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము 16 వ శతాబ్దము వారని తెలియవచ్చుచున్నది. దీని కితరవిషయములును దోడ్పడుచున్నవి.

శ్రీకృష్ణుఁడుజారుఁడా?


"శ్లో॥ నూతనజలధరరుచయే । గోపవధూటీదుకూల చోరాయ । తస్మైకృష్ణాయనమస్సం సారమహీరుహస్య బీజాయ॥" ముక్తావళి.

యోగీశ్వరేశ్వరుఁడైన శ్రీకృష్ణపరమాత్మ హిందువులకెల్లను బరమదైవముగనున్నాఁడు. సకలకళ్యాణ గుణపరిపూర్ణుండగు గోపాలుండు జారుఁడని యజ్ఞులగువారు భ్రమపడుచున్నారు. ఈదురూహమొదట పరమతస్థులకును పర