278
ఉపన్యాసపయోనిధి
బాలగంగాధర తిలకుల మతమునుబట్టి గ్రీక్కువారికిని మనకును జాలసంబంథము కలదుగదా.
గ్రీక్కుభాషలోనిపురాతన గ్రంధములలో అపొల్లొ (Apollo అనుపదము కాన్పించుచున్నది. దీనినింగూర్చి “ఇండియా ఇన్ గ్రీసుఆర్‌ట్రూత్ ఇన్ మైథాలజీ (“India in Greece or Truth in Mythology") అను గ్రంధరాజములో నిట్లు వ్రాయబడి యున్నది.
"Another Scion of this royal stock has been demonstrated to be the deified chrishna of the Lodacae, men (Loedaimon) whose name was also.
(A.) Balano-z Apollonos, or Apollo.
The name Apollonos is the Greek euphonic term of A Balono-ja name of krishna,
(* derived from "Bala" Balarama and "anoja" younger brother.)
(దైవముగా భావింపఁబడు కృష్ణుఁడు ఈ రాజవంశము యొక్క మఱియొక శాఖగానున్నాఁడు. ఈతనికి ఆ “బలొనోజ్” అ “పల్లోసు” లేక “అపొల్లో” అని నామాంతరము కలదు.
అ 'పొల్లొనోన్' అనునది కృష్ణునిపేరగు ఆ 'బలానొజ* అనుదానిని గ్రీక్కులు ఉచ్చారణ సౌకర్యార్ధమై మార్చుకొనిన పదమైయున్నది. (*అ "బలానోజ్" అనునది "బలానుజ"