276
ఉపన్యాసపయోనిధి
క్రీస్తుపుట్టుటకుఁబూర్వము 12,13వ శతాబ్దములలో.
పాణిన్యాచార్యులవారు క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము 12, 13 శతాబ్దముల నాటివారని యందఱు నంగీకరించు చున్నారు. ఈమహర్షి తనవ్యాకరణములో :-
"వాసుదేవార్జునాభ్యాంపున్” (4-3-98)
అని వాసుదేవార్జునులపేరు నెత్తియున్నాఁడు.
పురాణములలో.
భాగవతముకాక విష్ణుపురాణమునందును, బ్రహ్మ పురాణమునందును, బ్రహ్మకైవర్తము నందును, స్కాందము నందును, వామనము నందును, కూర్మ పురాణము నందును, గూడఁగృష్ణుని పూజనీయ చారిత్రము తెలుపఁబడి యున్నది. వీనిలో, విష్ణు, బ్రహ్మ బ్రహ్మకైవర్తములయందు విపులముగా నీఁబడియున్నది.
శ్రుతులలో.
ఛాందోగ్యోపనిషత్తులో “కృష్ణాయ దేవకీపుత్రాయ” అని విస్పష్టముగాఁ దెలుపఁబడియున్నది.
తై త్తిరీయమునందు “నారాయణాయ విద్మహెవాసుదేవాయ ధీమహితన్నోవిష్ణుః ప్రచోదయాత్" అనిచక్కఁగా
దెలుపఁబడియున్నది.
ఇంతియకాక ఆరణ్యకములందుఁ గూడ శ్రీకృష్ణుని పేరు కాన్పించుచున్నది.
వీనియం దన్నిటియందును గూడ శ్రీకృష్ణుఁడు పూజ నీఁయుఁడుగను విశేషించి యవతారమూర్తిగను వర్ణింపఁబడి