Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీకృష్ణమూర్తి.

275

కరింపఁబడుచున్న మేఘసందేశమునుండి యొక యుదాహరణము నిత్తము.


“రత్నచ్ఛాయావ్యతికర ఇవప్రేక్ష్యమేతత్పురస్తాత్ । వ
ల్మీ కాగ్రాత్ప్రభవతిధనుః ఖండమాఖండలస్య। యేనశ్యా
మంవపురతితరాం కాంతిమావత్స్య తేతే బర్హేణేవస్ఫు
రితరుచినా గోపవేషస్యవిష్ణోః"


క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము 2 వ శతాబ్దములో


పాణిని వ్యాకరణమునకు మహాభాష్యమును చేసిన పతంజలి క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము 2 శతాబ్దము నాటివాఁడందురు. ఈ భాష్యకారులవారి భాష్యములో కృష్ణుని ప్రశంస మిట్లు చేయఁబడియున్నది.


“హేతుమతిచ" (3-1-26) అను పాణిని సూత్రముయొక్క భాష్యములో “కంసవధమాచష్టే కంసంఘాతయతి” అనియు “సప్తమ్యధికరణేచ” (2-3-36) అను సూత్ర భాష్యములో:- "అసాధుర్మాతులేకృష్ణః" అనియును నుదాహరణములీఁబడియున్నవి.


క్రీస్తుపుట్టుటకు బూర్వము 5 వ శతాబ్దమున.


“లలితవిస్తరము” అను బౌద్ధమత గ్రంథములో 11 అధ్యాయములో శ్రీకృష్ణులవారి పేరుగ్గడింపఁబడియున్నది. ఈ గ్రంథము క్రీస్తుపుట్టుటకుఁ బూర్వము 5 వ శతాబ్దము నాటిదని ప్ర్రాజ్ఞులు వ్రాయుచున్నారు.