274
ఉపన్యాసపయోనిధి
విషయములో ధీరేంద్రనాధపాలుగారు హూణభాషలో నొనరించిన "శ్రీ కృష్ణుఁడు అతని జీవితమును బోధయును" (Srikrishna His life & Teachings) అను నుత్తమ ప్రౌఢగ్రంధము చాలసాయ మొనర్పఁగలదుగాన దానిని ప్రధానాధారము చేసికొని ముచ్చటింతము.
గ్రంధదృష్టాంతము.
7 వ శతాబ్దములో
క్రీస్తుశక మేడవశతాబ్దమున “వాసవదత్త" యను సంస్కృతకావ్యము సుబంధునిచే వ్రాయఁబడినదని యిప్పటి బుద్ధిమంతులెల్లరు తలంచుచున్నారు. ఆయుత్తమకావ్యములో “శ్రీకృష్ణఇవ యశోదానందవర్ధనః" అని శ్రీకృష్ణవృత్తాంత మీఁ బడినది.
6 వ శతాబ్దములో.
కాళిదాసు క్రీస్తుశకము 4, 6 శతాబ్దముల నడిమికాలము వాఁడందురు. ఈమహాకవి తననలోదయములో శ్రీకృష్ణు నిట్లు వర్ణించియున్నాఁడు.
"శ్లో॥ హృదయ సదాయాదవతః పాపాటవ్యాదురా సదా యాదావతః ।
అరి సముదాయాదవతస్త్రి జగన్మాగాస్స్మ రేణదాయాదవతః ॥"
ఈనలోదయము కొందఱి మతముచే కాళిదా సకృతము గాకున్నది. కాన కాళిదాసకృతమని యందఱిచేతను అంగీ