Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

ఉపన్యాసపయోనిధి

ర్తి యైనచో నచ్చోట దేవుని యవతారమును బూర్తి కావలెను. ప్రతిజాతివారునుదమ పురాణగాధలలో దేవాంశాసంభూతులైన మానవులచారిత్రములు గలిగియుండుటచే దేవుఁడు లోకములో నవతార మెత్తుననుటకుం జాలినంత ప్రబలసాక్ష్యము కలుగుచున్నది. ప్రతిమానవుని హృదయము నందును మానుషాకృతి నందిన భగవంతుని బొంద వలెనను కోరిక కలుగుచుండును) ఈ"క్రిష్టియనుకాలేజి మాగజైను”లోఁ దెల్పఁబడినరీతిగా మానవుఁడు దేవుని సజాతీయమైన మానవాకృతిలోఁ జూడఁ దలంచు చుండును గావున నేయవతారముల నమ్మమని బీరములుపలికిన బ్రాహ్మ సామాజికులందుఁగూడ దుదకీనమ్మకము కలిగినది. తుదికాలమున కేశవచంద్రసేనులవారు తామవతార మూర్తులమని చెప్పుకొనఁజొచ్చిరి. వారిశిష్యులును వారిని బూజింపఁ జొచ్చిరి. ఎంతదూరమోపోవుట ఎందుకు మన రాజమహేంద్రవరమునందే కృష్ణాద్యవతారముల పూజలోభాగముపంచుకొనఁదగిన యవతారమూర్తులు సంఘసంస్కర్తల దృష్టిలోబయలువెడలిరి. వీరినామమందే గొప్ప విశేషమున్నట్లు శ్రీయార్. వెంకటరత్నం నాయుడు ఎమ్. ఏ. గారంతటివారు చెప్పినట్లువినవచ్చుచున్నది. కావున మానవ కోటియెప్పుడును దేవసహాయతను దదవతారమూర్తిని గనఁగోరుచుండుననుటకింతయు సందియములేదు.