శ్రీకృష్ణ భగవానులవారు.
271
త్యవసరమనియుఁ దలంచు స్థితియందే యున్నారు. ఆపట్టణ రాజమునంగల నవనాగరికా గ్రగణ్యుల గ్రంధముల నుండి యిట్టివాక్యరత్నముల వేనవేలఁ జూపవచ్చును.
మఱియును క్రిస్టియనుకాలేజి మాగజయిను (The Christian College Magazine) లో నిట్లువ్రాయఁబడియున్నది.
"Creation and incarnation are by no means irreconcilable ideas. When God creates. he acquires existence in the objects. He creates so that the natural universe, in a lower sense, and man in a far higher sense, become the temple of God. And if God thus becomes incanate in humanity, it follows that, where the creation of man reaches its climax, as in the case of Christ, there also must God's incarnation in man reach its climax. The crowd of divine-human ideals which the mythologies of the world have furnished. testify to this conception;......e still, the deep craving has been there - the desire to seea humanised God."
సృష్ఠియును అవతారమును నొకదానికొకటి సందర్భములేనివికావు. భగవంతుఁడు సృజించునప్పుడు సృష్టపదార్ధములలో నాతని యునికికలిగియేయున్నది. కావున సామాన్యప్రపంచమునందు స్వల్పముగను మనుజునందు విశేషముగను దేవుని నిలయములేయగుట తటస్థించును. ఈవిధముగా భగవంతుఁడు మానవజాతిలోని కవతరించి నప్పుడు క్రీస్తు [కృష్ణుఁడు] మొదలగువారియందు మానవత్వము పూ