270
ఉపన్యాసపయోనిధి
తుఁడుపైనుండి కాపాడుచున్నప్పుడు ప్రజలకుఁ జిక్కులే కలుగఁగూడదుగదా యిఁక చిక్కు లెట్లు ప్రపంచములో గలుగుచున్నవనిన వీరేమిచెప్పఁగలరు. లోకములోఁబ్రజలు తామువిడదీసికొనఁజాలని చిక్కులలోఁ దగులు కొనుటయు నప్పుడు జిక్కులనెల్ల విడదీయఁగల మహాత్ముఁ డొక్కరుండు జనించి బహుజన సంఘములు విడఁదీయలేని చిక్కులనెల్లఁ దాను విడఁదీసి ప్రజల సుఖస్థితియం దుంచుటయును బుద్ధిమంతులందఱు నంగీకరింపఁదగినదియేకదా.
"No thoughtful student of the past records of man," says Archbishop Trench. "can refuse to acknowledge that through all its history there has run the hope of a redemption from the evil which oppresses it; and as litle can deny that this hope has continually attached itself to some single man. The help that is coming to the world, it has seen incorporated in a person. The generations of men, weak and helpless in themselves, have evermore been looking after One in whom they may find all they seek for Vainly in themselves and in those around them."
అనువాక్యములో "ట్రెంచి” యను మతబోధకుఁడు పైఁజెప్పఁబడురీతినే చెప్పియున్నాఁడు. ఈవిధముగానే మారాజమహేంద్రవర బ్రహ్మసమాజకులును జిక్కులు నాలుఁగుమూలలనుండియుఁ దగులుకొనినప్పుడు వానినుండి మరలుటకు మనుష్యశక్తిచాలదనియు నట్టితఱి దైవ సాహాయ్యమ