శ్రీకృష్ణ భగవానులవారు.
269
క్కులలో దగులుకొనక స్వేచ్ఛగా సంచరించుచున్నంతకాలమును దాముతటస్థులైయుండి యాయర్భకులు తాము విడఁదీసికొనలేని చిక్కులలోఁ దగులుకొను స్థితికివచ్చినప్పుడు తాము (తలిదండ్రులు) తక్షణమచటకి వచ్చి పుత్త్రకుల చిక్కుల విడఁదీసి మరల వారిని స్వేచ్ఛగాఁ గ్రీడించుటకు విడచి తాము మరలి చనురీతిని లోకపితయగు భగవంతుఁడును దనసంతతులగు ప్రజల లోకంబున స్వేచ్ఛగాఁ గ్రీడింపవిడచియును నీకించిద్‌జ్ఞులుచేయు వ్యాపారములఁ బరికించిచూచుచు వీరలు సామర్థ్యము చాలమిచేఁ జిక్కులలోఁ బడిపోవుతఱిని అనఁగా ధర్మ మడుగంటి యధర్మము ప్రబలు సమయమునఁదు సాధువుల నడుగఁ ద్రొక్కి దుష్టులు వ్యాపించు కాలము నందునాయాచిక్కులఁ దొలఁగించి లోకమునుయధాస్థితియందుంచుటకై భగవంతుఁడు లోకమున నవతరించునని పెద్దలు చెప్పుదురు. శ్రీకృష్ణులవారు భగవద్గీతలలోనిట్లు చెప్పియున్నారు. “శ్లో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచదుష్కృతాం। ధర్మసంస్థాపనార్ధాయ సంభవామియుగేయుగే॥” (సాధువులను రక్షించుటకు ధర్మసంస్థాపనముచేయుటకు నేనుప్రతియుగమందును అవతరింతును.) ధర్మసంస్థాపనార్ధమై భగవంతుఁడుభూమిపై నవతరింప నేల సర్వశక్తుఁడైన పరాత్పరుఁడు భూమిపై నవతరింపకయే ప్రజల యిక్కట్టులను మాన్పజాలఁడా! వేఱుగ యవతార మెత్తనేల? యనికొంద ఱడుగవత్తురు. సర్వశక్తుఁడైనభగవం