Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభేదానందస్వామి - వేదాంతము.

267

ము నిలచినందులకే ఈవర్తకపు దినములలోను ఈప్రకృతిప్రధానపు దినములలోను గూడ మనము లోకమునకుఁజూపునది యిదియే.

వేదము దేనిని బోధించునో తెలిసికొనుటకుఁ బూర్వము వేదశబ్దార్ధమును మనము తెలిసికొనవలెను. వేదశబ్దార్ధము జ్ఞానము. వేదశబ్దము "విద్” అను సంస్కృత ధాతువు నుండి పుట్టినది. దానికిఁ దెలిసికొనుట యని యర్ధము. వేదశబ్దము విద్‌జ్ఞానే యను ధాతువు నుండి పుట్టినదిగావున వేదాంతమనఁగా జ్ఞానావధియని యర్ధము. అజ్ఞానమెట్టిది దానినిఁ దెలిసికొనుట యెట్లు అనునవి వేదాంతముయొక్క ముఖ్యోద్దేశములు. జ్ఞానముయొక్క అంతమనఁగా ప్రకృతినిమన మింద్రియమూలముగాఁ దెలిసికొనవలసిన దానిపరమార్ధ మని యర్ధము. ఈబాహ్య ప్రపంచమంతయు దృశ్యాదృశ్యమైయున్న విశ్వములో సగపాలు. ఇఁకనొక సగపాలు కలదు. అదివిషయికాని విషయముకాదు. దానిమూలముగానే మనమీ బాహ్యప్రపంచమును జూచిగ్రహించు కొనుచున్నాము. బాహ్యప్రపంచము వట్టివిషయము మాత్రమేయైయున్నది. ఈబాహ్యాభ్యంతర ప్రపంచములను రెంటినినేకీభవింపఁ జేసినప్పుడ మనకు దివ్యజ్ఞానము కలుగును. అదియేనిత్య జ్ఞానము. ఆజ్ఞానమెచ్చట నున్నది ? ఈప్రపంచముకంటె భిన్నముగానున్నదా ? మనదేహములకంటె నతిరిక్తమైయున్నదా ? లేదు. ఆదివిశ్వమునం దంతటను నిండి