262
ఉపన్యాసపయోనిధి
ధువులెవ్వరు ద్వేషించియుండలేదనియుఁ దెలియఁజేయుచున్నది. తల్లిగారువుత్రుని సన్న్యాసాశ్రమస్వీకారమున కంగీకరించినప్పుడు తమకుత్తరక్రియలాచార్యులవారే జరుపునట్లొడంబఱచుకొనెను. యతీంద్రులు సన్న్యాసమును స్వీకరించుట సన్న్యాసియైయుండియు మరల తల్లిగారి మరణానంతరముననామె యుత్తరక్రియల జరుపుట బంధువులందు ద్వేషమునుబుట్టించినది.
ఇట్లు సన్న్యాసమును స్వీకరించి మాతృ వందనము చేసి యీబాల యతివర్యులు గోవింద తీర్థులవారి కడకు విద్యాశాంతి చేయుటకై చనిరి. గోవింద తీర్థులకడకుఁబోయి యాయనపాదపద్మములకు మ్రొక్కఁగా నీవెవ్వఁడవని గోవిందపాదులు ప్రశ్నచేసిరి. అందుపై గురువర్యా నేను అగ్నిని కాను, వాయువునుగాను, భూమినిగాను, ఈభూతములలో నేదియునుగాను ఈసమస్త ప్రపంచాంతర్యామియైన యాపరమాత్మను అనిసమాధానము చెప్పెనట. విద్యనేర్చుకొనుటకుఁ బూర్వమే యింతవివేకమును జూపుట సంభవింపదుగాన నీసంభాషణము జరిగియుండదని కొందఱు తలంచుచున్నారు. కాని యట్లుతలంచుట యుచితముకాదు. ఆచార్యులవారు మొదటినుండియు నఖండమహిమమును జూపుచునేయున్నారు. బాల్యమునందే విశేషవిద్యల స్వీకరించి బాల్యమునందే బంధువులెల్లరు ద్వేషించుచుండినను తల్లివలదనుచుండినను లౌకిక మోహముల నెల్ల త్రుంచివైచి యసిధారావ్రతమైన