Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీశంకరభగవత్పాదులవారు.

259

దొడ్డిలోఁ జేయుటచేత ఈయాచారము నంబూరిబ్రాహ్మణు లందఱి యందును వచ్చినదనుట వెఱ్ఱిమాట. నంబూరి బ్రాహ్మణులందు నీ యాచారముండుటచే నాచార్యులవారు తల్లిగారి దహన సంస్కారమును జేసియుందురుగాని యాచార్యులవారట్లు చేసియుండుటచే నాకులమువారి యందీయాచారముపుట్టియుండదు. ఆచార్యులవారి బంధువు లెల్లరువానిద్వేషింతురుగాని పూజించియుండరుగదా. ఇఁక వారిననుసరించి యీయాచారముపుట్టుటయెట్లు? శాపవశమునననినదాని నిప్పుడు మనము నమ్మముకదా. కావున నీకధలెల్లనువిరోధులచేఁ గల్పింపఁబడినవి. మనమాధ్వసోదరులు విరచించిన మణిమంజర్యాదులవలన నాచార్యులవారియందు వారెంత వృథాద్వేషము నూనిరో బాగుగాఁ దెలియఁగలదు. శంకరవిజయాదులవలన చౌలాది సంస్కారము లనుగూడ తండ్రిగారే చేసినట్లు కాన్పించుచున్నది.

శంకరవిజయములను బట్టి భాష్యకారులవారి తాతతండ్రులు విద్యాధిరాజ బిరుదాంకితులుగాఁ గాన్పించు చుండుట చేతను ఆచార్యులవారి జన్మదినమున శివగురుండు విశేషముగా భూదాన గోదానధనదానాదికము పుత్రోత్సవము గాఁ బంచిపెట్టినట్లు వర్ణింపఁబడియుండుటచే మంచి స్థితిగల విద్వత్కుటుంబమున గురువరు లవతరించిరని తెలియ వచ్చుచున్నది. ఈకుటుంబమునకు శివుఁడిష్టదైవతము. అందు మూ