శ్రీశంకరభగవత్పాదులవారు.
255
స్థానము.
ఆచార్యులవారిజన్మస్థానము మళయాళదేశములోని "కాలటి" యను గ్రామమని కొందఱును (మణిమంజరి) చిదంబరమని కొందఱును (ఆనందగిరి) వ్రాసి యున్నారు. కాని యొక్క ఆనందగిరి మాత్రమే చిదంబరమును జెప్పియుండుటచే కాలటి యేవీరి జన్మస్థానమని పలువురు బుద్ధిమంతులు తలంచుచున్నారు.
కులము
షణ్మత స్థాపకులైన యాచార్య పాదులవారు నంబూరి బ్రాహ్మణులు హిమవత్పర్వత ప్రాంతములందు ఆచార్యుల వారిచే ప్రతిష్ఠింపఁబడిన బదరీనారాయణాలయమున నిప్పటికిని అర్చకులు దక్షణదేశమునుండి వచ్చునంబూరిబ్రాహ్మణులగుటచే గురువర్యులు నంబూరి బ్రాహ్మణులేయై యున్నారనివివేకులెల్లరు తలంచుచున్నారు.
వంశాదికము.
ఆచార్యులవారి తల్లి శ్రీసతీదేవి. తండ్రి విద్యాధిరాజ బిరుదాంకితుండగు శివగురుఁడు. గురువుగోవింద పాదాచార్యులు. పరమగురువు (గురునిగురువు) గౌడపాదాచార్యులు. ఆచార్యులవారు తమభాష్యములలో గురుభక్తిచాలదూపియున్నారు. పితృభక్తియును వీరికిమెండు.
ఆచార్యుల వారిజన్మమునుగూర్చి యొక వింత కధకలదు. లోకములో మహాపురుషుల చారిత్రము లన్నియు వింతలతో