Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

ఉపన్యాసపయోనిధి

దినది. కుమారిలమతముచ్చస్థితి యందున్నది. కాననే వీరికి బౌద్ధులతోఁ గంటె కుమారిలశిష్యులతో వాదమెక్కుడైనది.

శ్రీజగద్గురువుల చారిత్రమును మనము వ్రాయుటకుఁ గలయాథారములు (1) మాధవాచార్య, ఆనందగిరి, చిద్విలాసాదులచే వ్రాయఁబడిన శంకరవిజయములు ముఖ్యములు. (2) పరవక్షులచే వ్రాయఁబడిన మధ్వవిజయము మణిమంజరి మొదలగునవి మధ్యమములు (3) తరువాతివి, విల్సను మాక్సుమూలరు టిలాంగు మొదలగు నాధునికులు వ్రాసినవి. మొదటివి భక్తితోఁ గూడుకొనినవి రెండవవిద్వేషముతోఁ గూడుకొనినవి. మూఁడవవినవీనములు.

భగవత్పాదులవారి కాలము.

ఈకాలమెప్పుడు ? భగవత్పాదులవారెప్పుడు ధర్మ సంస్థాపనవిషయమై యవతరించిరి. అనునది తరువాత విచారింవవలసియున్నది ఆచార్యులవారి కాలము విషయమై భిన్నాభిప్రాయములు కలవుగాని వీరు క్రీస్తుశకము 788 సంవత్సరమున జననమొందిరని పలువురు తలంచుచున్నారు. వీరు సూత్రభాష్యములో మగధదేశ పరిపాలకుఁడును బౌద్ధ ప్రభువునగు పూర్ణవర్మను బేర్కొనియుండుటచే జగద్గురువులవారు 6 వ శతాబ్దమందలివారని టిలాంగుగారు దృఢముగా వాదించియున్నారు. ఆచార్యులవారు చైత్రశుద్ధ దశమినాఁడు జననమొందినట్లు వాడుకకలదు.