252
ఉపన్యాసపయోనిధి
బోధకులలో నెల్ల బోధకాగ్రణియు వక్తలలో నెల్ల వక్తృశిఖామణియు కవులలో నెల్ల కవిగ్రామణియు విమర్శకులలోనెల్ల విమర్శరత్నమును మతోద్ధారకులలో నెల్ల మతోద్ధారక శేఖరుండును యతీంద్రులలోనెల్ల పరమ యతీంద్రుండును నగు శ్రీమచ్ఛంకర భగవత్పాద పూజ్యులవారి విమలజయంతిచే నీతరిపవిత్రముచేయఁ బడియున్నది గాననాశంకరావతార మూర్తియొక్క పూజ్య చారిత్రముంగూర్చి యొకింత ముచ్చటించుకొందము.
భాష్యకారుల వారి పావనచారిత్రముంగూర్చి ముచ్చటించుటకు ముందు ఆయన యవతార కాలము నాటికి మతాచారములవిషయమయి మనదేశ మెట్లున్నదో యించుక చర్చింపవలసియున్నది. లోకములో ధర్మ సంక్షయమైనపుడెల్ల దివ్యపురుషులుదయించి తత్కాలాను కూలముగ ధర్మసంరక్షణ మొనరించుచుందురుగాన శ్రీభగవత్పాదులనాటికిధర్మస్థితి యెట్లున్నదో విచారించుట ప్రధమకర్తవ్యమైనది.
శ్రీశంకర విద్యాతీర్థులవారి నాటికి బౌద్ధమత ముచ్చస్థితినుండి మరలిదారుణవైరాగ్యమును బోధించిబోధించిహద్దు దాటివ్యాపారశూన్యత, దుష్కార్యదూష్యతలోనగు ననర్ధములకు మూలమై చెడుస్థితిలోనికి వచ్చుటచే దాని దుర్ణయమును నివారించుటకై కుమారిలభట్టుమండనమిశ్రుఁడు మొదలగువారు బయలువెడలి వైరాగ్యమూలమైన సన్యాసమును నిరసించివైచి గృహస్థాశ్రమము ప్రధానముచేసి కేవల కర్మ