250
ఉపన్యాసపయోనిధి
కు మహషిన్‌యని బిరుదమునిచ్చి బ్రాహ్మ సామాజికులు తమకధ్యక్షునిగాఁ జేసికొనిరి. విశేషమైన వివేకము విశేషమైనధర్మబుద్ధిగలిగి మహషిన్ యనిపించుకొనిన యీబ్రాహ్మసామాజికాధ్యక్షుఁడు కూడ యజ్ఞోపవీతరహస్యము తెలియక భ్రమపడి దానిని జాతిని దెలుపునదిగా గ్రహించి తీసివేయుటలో మాత్రము తనశూరత్వము చూపకలిగెనేకాని వర్ణాంతరులతో సంబంధ బాంధవ్యములు కలుపుకొనుట కిష్టపడలేకపోయెను. అనఁగా బహిస్సూత్రమును దీసిపారవైచెనేకాని యంతస్సూత్రమును దీసిపారవేయలేక పోయెను. ఇఁకక్రోధదేవతకు బలులై తాఁబట్టిన కుందేటికి మూఁడేకాళ్ళను మనుజులు పైనుండివచ్చిన ప్రోత్సాహమును బోరును బడలేక యతిబలవంతముమీఁద దేహముపైనొకమూలఁబడి చివుకుచున్న జన్నిదపుపోచల నూఁడదీసిపారవైచి నంతన లాభముండఁ గలదా? అస్మ ద్దేశీయు లారా, యివి వట్టి యాడంబరములుచుండి ?
మనస్సుపరివక్వమై సర్వభూతము నాత్మవత్తుగాగ్రహించునిక్క మగు నాత్మజ్ఞానికి జాతిభేద ముండదుగాని తక్కినవారి కెల్లరకుండితీరును. అట్టిసాధువు లీపైపైయాడంబరములను జేయరు. బ్రాహ్మణుఁడు, యజ్ఞోపవీతియు, హిందువునైన రామకృష్ణపరమహంస కడజాతి మాలవాని గుడిసెకడకుఁబోయి వానిముంగిలినూడ్చి వానికుపచారములఁజేసి వాని దాసత్వము నపేక్షించినాడు. ఈపని golden deed అనికా