Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

ఉపన్యాసపయోనిధి

షష్టః ప్రాజాపత్యః। సప్తమోవిష్ణుదైవత్యః। అష్టమస్సూర్యః। సర్వ దైవత్యో నవమః" అని సూత్రము లందు వ్రాయఁబడినది.

ఈవిధముగా జన్నిదమునందు వేదమతము, ఉపనిషన్మతము పురాణమతమునుగూడఁ గాన్పించుచుండుటచే నియ్యదిమిక్కిలి పురాతనమైనదనియు పవిత్రమైనదనియు వేదవేదాంతరహస్యోపేత మైనదనియు సన్నియమమునుదెలుపు యోగ్యమైన సూత్రమనియు బాగుగాఁ దెలియవచ్చుచున్నది.

కాఁబట్టియిట్టి పవిత్రమును ధరించుట నొక ఘనతగానెంచికొనుట యుచితముగానేయున్నది.

"Brahmins, and all the other castes which have the right to wear this cord, prize it more highly and are certainly more proud of it than are many Europeans who by noble birth or great deeds possess the right to wear the cordon of the knightly orders."

అని డూబోయి వ్రాసియున్నాఁడు. ఉత్తమవంశంబునఁ బుట్టినవారలు తమయుత్తమ వంశత్వమును దెలుపు సూత్రము దేహమునందుఁ దాల్చుట దానినిఘనతగా నెంచికొనుటయు పశ్చిమదేశములందును గలదని దీనివలనఁ దెలియవచ్చుచున్నది. పశ్చిమ దేశములందు నుత్తమవంశమునఁ బుట్టిన మాత్రముననే ఘనతను దెలుపుజన్నిదమును (Cordon) ధరించుట కధికారముండఁగా నదిఘనతకాఁగా నీదేశమునందు మాత్రమేలకాదు.