యజ్ఞోపవీతరహస్యము.
245
ఇది కైవల్యనవనీతమందును గాన్పించుచున్నది. సీతారామాంజనేయ సంవాదతాత్పర్య కారులును కైవల్యనవనీతకారులు గలసియే ఈ విషయమును వ్రాసిరని' తోఁచుచున్నది.
ఇంకను ఈజన్నిదముంగూర్చి అబ్బేడూబోయిపుస్తకమును బ్రచురించిన బౌచాంపుదొరవారిట్లు వ్రాసియున్నారు.
"The triple card is thus explained by one authority: It symbolizes the body, speech, and mined, It symbolizes the control of each; and therefore when the knots are tied in it, it means that the man who wear the thread has gained control over body, speech and mind" (ఒక ప్రమాణగ్రంధమున యజ్ఞోపవీతముంగూర్చి యిట్లు వ్రాయఁబడియున్నది. అయ్యది మనోవాక్కాయములప్రతిమయయి యున్నది. అయ్యది యామూటిని వశపరచుకొనుటకును బోథించును కాన ముళ్ళు వేయఁబడినప్పుడు దానినిథరించిన వాఁడామనోవాక్కాయముల మూటిని దనవశమున నుంచుకొనినాడని తెలుపును)
ఇంకను యజ్ఞోపవీతముంగూర్చి మోనియరు విలియమ్సు దొరవారు తమ "Religious thought & Life in India" అనుగ్రంథములో నిట్లువ్రాయించి యున్నారు.
"If we inquire a little closely into the nature of the sacred symbol supposed to be capable of effecting so vast a transformation in human beings' codnition, we find that now as formerly, it consists of three slender cotton