244
ఉపన్యాసపయోనిధి
గూర్చి సీతారామాంజనేయసంవాద టీకలోనిట్లువ్రాయఁబడియున్నది.
"మలినసత్వప్రథానయగు మూలప్రకృతి తనత్రిగుణములచేత తొలుత త్రిశక్తులుగ దోఁచినవెనుక ఆత్రిగుణపరస్పర సమ్మేళనమువలన నవవిధములయి పిదప ఆ నవవిధానోన్య సమ్మేళనముచేత సప్తవింశతివిధములై తెల్లనివస్త్రమునచిత్రములు కల్పితములయినట్లు శుద్ధపరబ్రహ్మమందు పైఁ జెప్పఁబడిన యిరువదియేడు భేదములుగల సృష్టి గలయట్లుగఁ గనపఱచెను. మఱిపెదపురుషుఁడు యీ యిరువదియేడు భేదములుగల సృష్టికి కారణమయిన ప్రకృతిమయమగు గాయత్రి మూఁడుపాదములును భూర్భువస్సువ యను వ్యాహృతి త్రయముతోడ ఇరువదియేడక్షరములును గలదనిచెప్పి దానిని ద్విజాతులైన బ్రహ్మక్షత్రియ వైశ్యులకు తారతమ్యత చేత నుపాస్యముగా నిర్ణయించెను. మఱిగాయత్రికి మారురూపమగు యజ్ఞోపవీతమును మూఁడు సూత్రములు గలది. అందొక్క సూత్రమునకు మూఁడేసిఅంతరసూత్రములు గలవు. ఆయాంతర సూత్రములయందొక్కటొక్కటికి మూఁడుమూఁడు పోగులుగలవు గానమూఁడు పెద్దపోగులు గల ఆయజ్ఞోపవీతము ఇరువది ఏడుగలదయ్యెను. ఆతంతువులే ఇరువది ఏడు భేదములుగలజగత్తు. ఆజగద్రూపమగు యజ్ఞోపవీతమునే గాయత్రియని ద్విజాతులు ధరించిపరబ్రహ్మమునుద్దేశించి సర్వ కర్మముల చేయవలయు."