యజ్ఞోపవీతరహస్యము.
243
బ్రహ్మవిష్ణు మహేశ్వర సంజ్ఞలచేఁ బిలువకున్ననుసృష్టికర్త (బ్రహ్మ) స్థితికర్త (విష్ణువు) లయకర్త (మహేశ్వరుఁడు) అని వేఱువేఱు వ్యాపారములతోఁగూడిన వేఱువేఱు పేరులతోఁ బిలుచుచునే యున్నారు. ఈమూఁడు వ్యాపారములొక్క బ్రహ్మమునుండియే వచ్చుచున్నవను రహస్యము తెలుపునది యజ్ఞోపవీతమయి యున్నది. కావుననేపరబ్రహోపనిషత్తున జన్నిదముంగూర్చి యిట్లు వ్రాయఁబడియున్నది. "ఆద్యస్తరైకత్వమన మధ్యేత్రిరావృత్య బ్రహ్మవిష్ణు మహేశ్వరత్వమను సన్ధాయాద్యంతమేకీ కృత్యచిద్గ్ర న్ధావద్వైత గ్రంథిం కృత్వానాఖ్యాది బ్రహ్మబిల ప్రమాణం పృధక్పృథక్సప్తవిగ్ శతి తత్వసంబంధం త్రిగుణోపేతం త్రిమూర్తిలక్షణలక్షితమప్యే కత్వమాపాద్యవామాగ్ సాదిదక్షిణ కట్యన్తంవిభావాద్యన్త గ్రహసమ్మేళ మేకం జ్ఞాత్వా” అనితెలుపఁబడియున్నది. అభ్యంతర సూత్రముయొక్కయు బహిస్సూత్రము యొక్కయును గూడ రహస్యమిది కావున సృష్టిస్థిత్యంతములను గలిగించుచున్న భగవంతుఁడొక్కఁడేయనియు నాతనినుండియే సర్వమును బయలువెడలుచున్న దనియుఁదెలుపుచున్నది జన్నిదమయియున్నది.
ఇంకనుబైబ్రహ్మోపనిషత్తులో 'పృధకృధక్సప్తవిగ్ శతితత్త్వసంబంధం త్రిగుణోపేతం' అని వ్రాయఁబడి యున్న దానినిబట్టి జన్నిదమునందుఁగల యిరువదియేడుపోచల రహస్యమును బాగుగా బోథలోనికి వచ్చుచున్నది. ఈవిషయముం