Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

ఉపన్యాసపయోనిధి

డిదని చెప్పుచున్నారు. ఆహేతువుచేఁగూడ మత్స్యావతారము మొదటిదై యుండవలెను.

రెండవయవతారము కూర్మము. కూర్మము చాలభాగము నీటియందుండునదియు నొక్కింత మెట్టనుండునదియు నై యున్నది. కాన నిది రెండవ యవతారమైనది. ఇదిసరీసృవములలో మొదటిదిగా నెన్నఁబడుచున్నది.

"Hert again there must be manifeseation of the type of life, this time of what we call the reptile type the tortise is chosen as the typical creature." అని ఆనీబిసెంటు దొరసానిగారు వ్రాయించియున్నారు.

మూఁడవయవతారము వరాహము. ఇప్పటికి జలమును స్థలమును ఏర్పాటు అయినదిగాని బాగుగా స్థలము గట్టిపడి యుండలేదు. కాన బురదను మెచ్చువరాహావతారము తీసికొనంబడినది. చేప సదా నీటినపేక్షించునది. మెట్టనొల్లనిది కూర్మము తరుచుగా నీటియందేయుండి కొంత మెట్టనపేక్షించునది. ఇకవరాహమన్ననో మెట్టనుండి నీటినపేక్షించునది. సరీసృవముల తరువాత (అండజముల తరువాతయని చెప్పవచ్చును ) చనుగుడుచు యోనిజములు పుట్టినవిగాన యోనిజములను దెలుపునది వరాహము. ఇది పశుజాతిని దెలుపునది.

దీనితరువాత కొంతపశువుగను గొంత నరుఁడుగనునుండు నారసింహావతారము గలిగె. పాశ్చాత్య పండితుఁడగు డా