మానవుఁడు.
237
ట్లు చెప్పఁబడియున్నది. కాన సృష్టిమతము సృష్టియెట్లువచ్పినదో తెలుపుచుండఁగాఁ బరిణామమతము దానిసంబంధమును బోధచేయుచున్నది. రెండును గలసి మనుజుఁడు ప్రపంచములోనికిఁ దుదినివచ్చెననియు మొదటివానిలోనుండి పరిణమించి వచ్చెననియుఁ దెలుపుచున్నవి. మనుజుఁడు గ్రమముగా జంతుజాలములో నుండియేవచ్చెనను మతమును మనపురాణములు బోధించు అవతారక్రమమువలనఁగూడఁ దెలియవచ్చుచున్నదని కోవిదులు చెప్పచున్నారు. అవతారములలో మొదటి యవతారము చేపయని తెలువఁబడియున్నది. చరములలోఁ జేపమొదటిది దీనింగూర్చి డాక్టరు నికోల్సను (Dr. Nicholson) దొరవారిట్లు వ్రాయించి యున్నారు.
"The Lancelet presents us with the lowest type of organisation yet known in the vertebrata. The Lancelet is an extraordinary little fish, from one and a half to two inches long, which burrows in sand banks in barious seas."
దీనిని బట్టి చరములయుత్పత్తిలో చేపమొదటిదని ప్రకృతిశాస్త్రములు కూడ చెప్పుచున్నవని తెలియవచ్చుచున్నది. మత్స్యావతారముంగూర్చి పురాణములలో మొదటమిక్కిలి చిన్న చేపగాఁదోఁచినట్లె తెలుపఁబడియున్నది. భూతత్వ వేత్తలు భూమియు మొదట జలమయముగా నుండె