మానవుఁడు.
235
అని పోప్పను నింగ్లీషు కవీశ్వరుఁడు వ్రాసియున్నాఁడు. మనలోఁ దన్ను దాఁ దెలిసికొనుట ముఖ్యమనినొక్కి వక్కాణింవఁ బడియున్నది. “త్వమేవత్వాం వేద్ధయోసిసోసి" అని ప్రాజదువులు మొఱలిడుచున్నవి. కాఁబట్టి మనుజుఁడు మనుజుని గూర్చి తెలిసికొనుట మొదటిపని.
మనుజుఁడెట్లు వచ్చినాఁడు ? ఎక్కడనుండి యెప్పుడువచ్చినాఁడు? అని బుద్ధిమంతులెల్లరు ముందు ప్రశంసించుకొనవలెనుగాని దీనిసమాధానము మాత్రమంతఁగా సులభముకాదు. ప్రపంచోత్పత్తిని గూర్చి యనేకమతములు కలవు. కొన్నిమతములు సర్వశక్తిసమేతుఁడగు భగవంతుఁడొకఁడు పైనుండి తనశక్తిచే శూన్యమునుండియే యీప్రపంచమునంతను సృజించుచున్నాఁడని చెప్పుచున్నవి. దీనిసృష్టిమతము (Creation theory) అందురు. భగవంతుఁడారుదినములలో నీసచరాచరమయిన ప్రపంచమునంతను సృష్టించి యేడవదినమందు విశ్రాంతిని వహించినాఁడని బైబులు చెప్పుచున్నది. కొన్నిమతములు ఘనతమమయిన యీప్రపంచమొక్కసారిగాఁగాని యేడెనిమిదిదినములలోఁ గాని కల్పింపఁబడినదికాదనియు చిరకాలానుగతముగా వచ్చుచున్నదనియు పరిణామమూలముగా (Evolution theory) కలుగుచున్నదనియుఁ దెలుపుచున్నవి. ఇవియే ప్రకృతి శాస్త్రములనఁబడుచున్నవి. కేవలమూఢభక్తికి దాసులుగాక యుక్తికిలొంగియుండు వారెల్లరును బైబిలులోని సృష్టిమతమును నిరాక