జపానుదేశము - వేదాంతము.
233
యుఁ నల్పజ్ఞానమును సంపాదించుకొని ధన్యుల మనుకొను స్థితికి వచ్చుచుండుటయే యైయున్నది. జపాను దేశస్థులు స్వమతాభిమానమును స్వదేశాభిమానమును గలిగి మనఃపూర్వకముగాఁ గ్రమక్రమాభివృద్ధికిఁ బాటువడుచుండుటచే తనాదేశము క్రమక్రమాభివృద్ధి నందుచున్నది.
ఏది ఎట్లున్నను జపానుదేశస్థుల వృద్ధినిబట్టియే మతముయొక్క ఘనతను గ్రహింపవలసియున్న యెడల "జగన్మిథ్య” యను మతము (వేదాంతము) తెలివితేటలు కలవారిని మంచియభివృద్ధిలోనికిఁ దెచ్చునను భావముకలుగుచున్నది కాని రవిపత్రికలో మనసోదరులు వ్రాసినట్లుగా నయ్యది వృద్ధికి భంగముతెచ్చునదిఁగా దలంచుట యుచితముకాదు.
మన క్రైస్తవసోదరులు తమమతమును గూర్చి యెంత వ్రాసికొనినను జపానుదేశము నెంతవర్ణించినను మనదేశమునందలి నిక్కమయిన లోపముల నెన్నిటి నెత్తి చూపిననునేను దానినివిమర్శింపఁబోను. సందర్భములేనితావునమన వేదాంతమును దెచ్చిదానిని వృధాగాఁ దిరస్కరించిరి కావునను రవిపత్రిక బహు వ్యాప్తికలది కావునను స్వమతరక్షణార్ధమై నేనింత వ్రాయవలసి వచ్చినది కావుననో మిత్రులారా, మీరు దేశక్షేమము కోరుదురేని బహూపకారకమగువేదాంతమును బాగుగాఁ దెలిసికొని 'స్వయంతీర్ణః పరాంస్తారయతి' యనినట్లు మీరు తరించి యితరులఁదరింపఁజేయుఁడు. తెలిసికొనకయే వృధాగా నిందలు మోపకుఁడు. రామ