Jump to content

పుట:Upanyaasapayoonidhi (1911).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

ఉపన్యాసపయోనిధి

నగు సుబ్రహ్మణ్య అయ్యరుగారిట్లు వ్రాయు చున్నారు. 'లోకము మాయ యనియు సంసారము దుఃఖహేతువనియు... నీరీతిని మనవేదాంత శాస్త్రమునందలి యంశములనే యవలంబించినవారు' (స్వదేశ మిత్రలోనుండి బ్ర॥ క్రొ. సూర్యారావుగారు చేసిన తెలుఁగు) వీని నన్నిటినిఁబట్టి చూచిన వేదాంతము జపానుదేశస్థులను గ్రమ క్రమాభివృద్ధిలోనికిఁ దెచ్చుచున్నవని తెల్పవలయునుగదా! ఇక వేదాంతమును నిందించుటేల? 'జగన్మిధ్య' యను బోధనుచేయు వేదాంతమును నమ్ముకొనిన రెండు దేశములను దీసికొనివానియందలి తారతమ్యము నెంచుచు నందొక దేశముయొక్క పతనమునకు వేదాంతము మూలమనుట వెఱ్ఱిమాటకాక వేఱుకాఁగలదా? కావున రవిపత్రిక వారీపట్టున వ్రాసినవాఁత వెఱ్ఱివ్రాత. సామర్థ్యములేక బోలపడి దేశమచ్చివచ్చినది కాదనినట్లు మనము చేతకాక దేశమును హీనస్థితికిఁదెచ్చి దానికివేదాంతము కారణమనుట యనుచితము. ఈదేశము హీనస్థితికివచ్చుటకుఁ గారణము కాలకర్మవశమున నీదేశస్థులందు తగు మతాభిమానమును దేశాభిమానమును లేకస్వార్ధపరులై పరమతస్థులలోను బరదేశస్థులలోను గలసి స్వమతమును స్వదేశాచారములను నిందించుకొనుచు స్వమతమును గూర్చియును స్వదేశమునుగూర్చియు నిక్కమగుజ్ఞానమును సంపాదించుకొనకయే వానియెడల విముఖత్వమును వహించి పరమతములనుగూర్చియుఁ బరదేశములను గూర్చి