230
ఉపన్యాసపయోనిధి
వలసినదని నివృత్తిమార్గమును బోధించినాఁడుగాని ప్రవృత్తిమార్గమును బోధించియుండలేదు. నేనిట్లనుటచే శ్రీకృష్ణుఁడు భగవద్గీతలో మహమ్మదీయులు తలంచినట్లు దేశములపైఁబడి యుద్ధముచేసి ప్రజానాశన మొనరించుచుండవలసినదని బోధించినాఁడని తలంపరాదు. ధర్మ సంస్థాపనార్థమై వెనుదీయక యధర్మముతోఁ బోరాడవలసినదని నరునకుబోధించినాఁడేకాని యుద్ధ మొనరించుచుండుటయే వృత్తిగాఁబెట్టుకొనుమని బోధించియుండలేదు. కావున వేదాంత మేరీతిగా మనుజుని హీనస్థితికిఁ దెచ్చును? వేదాంతమన నేమోబాగుగాఁ దెలిసినవారెవరును దానివలన హానికలుగునని తలంపరు. బాగుగాఁ దెలిసినవారలు మాక్సుమూలరు దొరవారివలెనే వేదాంతము బహుపకారమనియే తలంతురు. మోనియరు విలియమ్సుదొరవారు మున్నగువారుకూడఁ గొన్ని తావుల నిట్టి యభిప్రాయములనేయిచ్చియున్నారు. ఇఁక వేదాంతమువలన నీతిమార్గమున కేమయిన భంగము కలుగునా యనిన నెంతమాత్రమును గలుగదు సరికదా దానికి సమస్తమార్గములకన్నను వేదాంతమార్గమే యెక్కడు సహకారిగానుండునని విజ్ఞులుచెప్పుచున్నారు. “The Vedanta philosophy, so for from merely supplying a metaphysical explanation of the world, aims at establishing its ethics on the most solid philosophical and religious foundations" (వేదాంతము ప్రవంచ మెట్లుపుట్టినదో యా